telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రైతులకు పీఎం కిసాన్ యోజన వర్తింపు: కన్నా

Kanna laxminarayana

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఏపీ రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం నగదు బదిలీ చేసిందని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. పీఎం కిసాన్ యోజన పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లోకి రూ.2000 చొప్పున జమ చేశారని తెలిపారు.

కష్టకాలంలో ఆపన్నహస్తం అందించిన ప్రధాని మోదీకి, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు రాష్ట్ర రైతుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని ట్వీట్ చేశారు.

Related posts