మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కుట్రపన్నారని.. ఈ మేరకు రెక్కీ కూడా నిర్వహించారంటూ ఆయన ఆరోపణలు చేశారు. కృష్ణా జిల్లా చిన్న గొన్నూరులో దివంగత కాపు నాయకుడు వంగవీటి మోహన రంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వంగవీటి రాధా పాల్గొన్నారు. అనంతరం ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
అత్యుత్సాహం కొద్ది ఏదో చేద్దామని చెప్పి తనను చంపాలని చూశారని ఆయన అన్నారు. రెక్కీ నిర్వహించింది వారు ఎవరో త్వరలో తెలుస్తుందని రాధా చెప్పారు. అలాంటి వ్యక్తులను దూరం పెట్టాలని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు.
రంగా గారి అబ్బాయిగా జనంలోనే ఉంటా, జనంతో ఉంటానన్నారు. కీర్తి, ఆశయాల సాధనే తన లక్ష్యమన్నారు. ఎవ్వరు ఏ వెదవ వేషాలు వేద్దామని చూసిన అది జరగదన్నారు. తన అభిమానులు కూడా అలాంటి వారికి దూరంగా ఉండాలని వంగవీటి రాధా అన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు తెలియజేస్తానని చెప్పారు.
ఈ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో కొడాలినాని, వల్లభనేని వంశీ అక్కడే ఉన్నారు. అయితే.. రాధా చేసిన ఆరోపణలు ఎవ్వరి మీద అనేది స్పష్టత రావాల్సి ఉంది.
అంతకుముందు వంగవీటి మోహనరంగా 33వ వర్ధంతి సందర్భంగా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీ తన మిత్రుడు, వంగవీటి రాధా ను కలిసారు. ముగ్గురు కలిసి బెజవాడలోని రాఘవయ్య పార్క్ దగ్గర ఉన్నటువంటి రంగా విగ్రహానికి పూలమల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఆ తర్వాత గుడివాడ దగ్గరలోని కొండలమ్మ గుడిలో మంత్రి కొడాలి నాని, వంశీ, రాధా కలిసి ప్రత్యేకంగా పూజలు చేశారు. ఎప్పటి నుంచో వీరు ముగ్గురు స్నేహితులుగా ఉన్నారు. ప్రస్తుతం రాధా టీడీపీలో ఉన్నారు. కాగా రంగ వర్థంతి సభలో రాధా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతోంది.
ప్రజావేదికను కూల్చి ప్రజాధనాన్ని నీళ్ల పాలు చేశారు: కన్నా