కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ హార్రర్ చిత్రాలను తెరకెక్కించడంలో తనదైన ప్రత్యేకతను చూపిస్తుంటారు. గతంలో లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన “కాంచన, కాంచన -2 చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో మరో సీక్వెల్ గా “కాంచన-3” చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ఆయనే ప్రధాన పాత్రలో నటిస్తున్న “కాంచన-3” ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో భయపెట్టే అంశాలతో పాటు కమర్షియల్ గా కూడా ఉంది. సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక కాంచన-3లో రాఘవ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేశారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. లారెన్స్ కు విలన్ గా కబీర్ సింగ్ నటిస్తున్నారు. ఓవియా, వేదిక ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏప్రిల్ 19న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతలా థ్రిల్ చేస్తుందో చూడాలి.
#Kanchana3 Censored with U/A Certificate@offl_Lawrence @Vedhika4u @OviyaaSweetz @TagoreMadhu @LightHouseMMLLP @shreyasgroup pic.twitter.com/MGuqwh4yIO
— BARaju (@baraju_SuperHit) April 8, 2019