2021 లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. తమిళనాడులో ఉద్దండులుగా ఉన్న రాజకీయ నాయకులు అమ్మ జయలలిత, కరుణానిధిలు కాలం చేశారు. ఈ ఇద్దరు లేకపోవడంతో తమిళనాడు రాజకీయాలు బోసిపోయాయి. ప్రస్తుతం అన్నా డిఎంకె అధికారంలో ఉన్నది. కానీ, అక్కడి నాయకులు పెద్దగా ఛరిష్మాయ లేదు. అమ్మ తన ఛరిష్మాతోనే పార్టీని గెలిపిస్తూ వచ్చింది. ముఖ్యమంత్రి పళనిస్వామి చెప్పుకోదగ్గ స్థాయిలో పాలన చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఇదిలా ఉంటె, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ పోటీ చేయబోతున్నది. ఎన్నికల బరిలో ఉండాలంటే కనీసం ఏడాది ముంచు నుంచే సిద్ధం కావాలి. ప్రజల్లోకి వెళ్లి చరిష్మాను పెంచుకోవాలి. సంస్థాగతంగా బలం పుంజుకోవాలి. ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లగలగాలి. ఇవన్నీ చేయాలి అంటే కమల్ హాసన్ సినిమాలు పక్కన పెట్టి రాజకీయాలపై దృష్టి పెట్టాలి.
అందుకే ప్రస్తుతం తానూ చేస్తున్న ఇండియన్ 2 సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. దర్శకుడు శంకర్ గురించి అందరికి తెలిసిందే. శంకర్ సినిమా తీయడం మొదలుపెట్టాడు అంటే ఆ సినిమా పూర్తికావడానికి చాలా సమయం పడుతుంది. భారతీయుడు 2 సినిమాను కూడా అదే రీతిగా తీస్తే.. 2021 ఎన్నికలు వచ్చేస్తాయి. అందుకే ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కమల్ హాసన్ శంకర్ ను కోరాడట. ఇప్పటికే సినిమా తొమ్మిది నెలలు ఆలస్యం అయ్యింది. ఎప్పుడో ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ సినిమా ఒక్క షెడ్యూల్ మాత్రమే పూర్తిగా కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికైనా స్పీడ్ పెంచితే.. సినిమా త్వరగా పూర్తవుతుంది. కమల్ పొలిటికల్ కెరీర్ కు ఇబ్బంది పడుతుంది.