*ఏపీలో నేడు, రేపు జేపీ నడ్డా పర్యటన
*పలు జిల్లాల్లో పర్యటించనున్న జాతీయ అధ్యక్షుడు నడ్డా
*విజయవాడకు చేరుకున్న జేపీ నడ్డా
*గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో జేపీ నడ్డా కు ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు
ఏపీలో బీజేపీని పటిష్టం చేసే దిశగా అధిష్టానం దృష్టి సారించింది. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూనే…మేధావులు, పలువురు ప్రముఖులతో భేటీ కావాలని నిర్ణయించింది.
ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రెండు రోజులు భాగంగా స్పెషల్ ఫ్లైట్‌లో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ బీజేపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గాన నడ్డా విజయవాడ బయల్దేరారు. ఆ తర్వాత బహిరంగ సభలో జేపీ నడ్డా సిద్దార్ధ హోటల్ మేనేజ్ మెంట్ కాలేజీ ప్రాంగణంలో భారీ సభలో ప్రసంగించనున్నారు.
ఇక సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు హోటల్‌లో బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు.అందులో పార్టీ భవిష్యత్‌పై వ్యూహాలు చర్చిస్తారు.
రాత్రికి విజయవాడలోనే బసచేసి రేపు ఉదయం 7.30 నిముషాలకు జేపీ నడ్డా విజయవాడలో దుర్గమ్మను దర్శనం చేసుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం రాజమండ్రిలో బహిరంగ సభకు హాజరు కానున్నారు.