ఏపీలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజానిధులు, ఆయా శాఖల అధికారులు కోవిడ్ భారినపడిన విషయం తెలిసిందే. తాజాగా మరో వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యే వైరస్ బారినపడ్డారు.
తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తాను కొవిడ్ పరీక్ష చేయించుకున్నానని పేర్కొన్నారు. పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, అయితే లక్షణాలు పెద్దగా లేవని వెల్లడించారు.
ఇక భూమన కుమారుడు అభినయ రెడ్డి కూడా ఇప్పటికే కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా కరోనా బాధితుల మృతదేహాల అంత్యక్రియలపై అపోహలు తొలగించేందుకు ఎమ్మెల్యే, కోవిడ్ సమన్వయ కమిటీ చైర్మన్ భూమన కొద్దిరోజుల క్రితం స్వయంగా రంగంలోకి దిగారు.