telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా ఎఫెక్ట్… జేఈఈ మెయిన్స్‌ వాయిదా

exam hall neet

ప్రస్తుతం కరోనా కారణంగా ప‌లు రాష్ట్రాలు ఎస్ఎస్సీ, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయ‌గా.. కొన్ని ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేశారు.. ఇక‌, సీబీఎస్ఈ సైతం ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసింది.. ప‌లు జాతీయ‌స్థాయి ఎంట్రెన్స్‌ల‌పై సైతం క‌రోనా ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.. ఇప్పుడు వాయిదా ప‌డిన ప‌రీక్ష‌ల జాబితాలో జేఈఈ మెయిన్స్‌ కూడా చేరిపోయింది.. ఐఐటీ, ఎన్ఐటీల్లో బీటెక్ లేదా బీఈ అడ్మిష‌న్ల కోసం నిర్వ‌హించే జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెష‌న్‌ను వాయిదా వేసింది నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ).. ఈ ప‌రీక్ష‌ను మ‌ళ్లీ ఎప్పుడు నిర్వ‌హించాల‌నేదానిపై త‌ర్వాత నిర్ణ‌యం తీసుకుంటామ‌ని.. క‌నీసం క‌నీసం 15 రోజుల ముందు తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించింది ఎన్‌టీఏ.. కాగా, షెడ్యూల్ ప్ర‌కారం జేఈఈ మెయిన్ ప‌రీక్ష ఏప్రిల్ 27, 28, 30 తేదీల్లో నిర్వ‌హించాల్సి ఉన్న విష‌యం తెలిసిందే. చూడాలి మరి మళ్ళీ ఈ వాయిదా పడిన పరీక్షలు ఎప్పటికి జరుగుతాయి అనేది.

Related posts