జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆర్టికల్ 370 రద్దుపై స్పందించారు. ఈ ఆర్టికల్ ను రద్దు చేయడం సాహసోపేతమైన నిర్ణయమని, ఈ సందర్భంగా ప్రధాని మోదీని అభినందిస్తున్నానని అన్నారు. ఈ నిర్ణయంతో భారత్, పాక్ దేశాల మధ్య, కశ్మీర్ లో శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నానని, దేశ సమగ్రత ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
తాజాగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జనసైనికులతో పవన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జనసైనికులు నిబద్ధత గల వ్యక్తులు అని అన్నారు. అపజయానికి క్రుంగిపోనని, విజయానికి పొంగిపోనని, ఎలాంటి సమస్యనైనా బలంగా ఎదుర్కొంటానని, తన ఆఖరి శ్వాస వరకూ పార్టీని నడిపిస్తానని మరోసారి స్పష్టం చేశారు.
పథకాలు మా విజయానికి కీలకం: చంద్రబాబు