కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి సంబందించిన పలు అంశాలపై చర్చించారు. నక్సలిజంపై కేంద్ర హోంశాఖ సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి సీఎం జగన్ హాజరయ్యారు.
అనంతరం వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డితో కలిసి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు.కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ విభజన చట్టంలో అమలు చేయాల్సిన పలు పెండింగ్ అంశాలపై కూడా చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు, ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకాలకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.