telugu navyamedia
సినిమా వార్తలు

ప్రతిరోజూ అద్దంలో చూసుకుని ఏడుస్తున్నాను : జబర్దస్త్ వినోదిని

Vinod

బజర్ధస్త్ కామెడీ షోలో లేడీ గెటప్ లతో వినోదినిగా పాపులర్ అయ్యాడు వినోద్. ఇటీవల వినోద్‌పై హత్యాయత్నం జరిగింది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కాచిగూడ పరిధిలోని కుత్బిగూడలో వినోద్‌ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఓ ఇంటి వివాదంలో వినోద్ పై తీవ్రంగా దాడి చేశారు. ఇంటి కొనుగోలుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులకు రూ.10 లక్షలు ఇచ్చానని, అయితే ఎంతకీ రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో పాటు, తన డబ్బు కూడా వెనక్కి ఇవ్వకపోవడంతో నిలదీశానని వినోద్ వెల్లడించాడు. సెటిల్మెంటు చేసుకుందాం రమ్మని చెప్పి తనపై హత్యాయత్నం చేశారని తెలిపాడు. రూ.10 లక్షలు అడ్వాన్స్ రూపంలో ఇచ్చానని, అయితే ఇల్లు ఇవ్వం, డబ్బులు ఇవ్వం పొమ్మని అవతలి వ్యక్తులు దౌర్జన్యం చేశారని వినోద్ వాపోయాడు. ఇంటి పైకి పిలిచి గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారని వివరించాడు. తప్పించుకుని కిందికి రాగా, వెంటపడి మరీ కడుపులో తన్నారని, తల చిట్లిందని, ఎముకలు విరిగిపోయాయని చెబుతూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ ఘటనలో వినోద్ తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వినోద్ మాట్లాడుతూ ఆ రోజున ఇంటికి సంబంధించిన వ్యక్తులు నాపై దాడి చేసిన దగ్గర నుంచి ఓ కన్ను సరిగ్గా కనిపించడం లేదు. అంతే కాదు గాయమైన కన్ను చిన్నగా అయ్యిందని కొంత మంది అనడం ఎంతో బాధకలిగిస్తుందని అన్నారు. అసలు లేడీ గెటప్ లో స్కిట్స్ వేస్తే నా కళ్లు పెద్దవిగా చూపించేవారు కానీ ఇప్పుడు ఆ కళ్లలో ఒకటి చిన్నగా అయిపోవడం… సరిగ్గా కనిపించకపోవడంతో నాకు అవకాశాలు రావేమో అని చాలా భయం వేస్తోంది. ప్రతిరోజూ అద్దం చూసుకుని ఏడుస్తున్నాను” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

Related posts