telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం.. కోడెల పై ఆరోపణలు!

AP assembly special status discussion

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ కుటుంబంపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. కే ట్యాక్స్ పేరుతో సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల కుటుంబసభ్యులు వసూళ్లు, బెదిరింపులకు పాల్పడ్డారని అనేక మంది కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అసెంబ్లీలో ఫర్నిచర్ మాయమైందన్న వార్తలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి.

కోడెల స్పీకర్‌గా ఉన్నప్పుడే హైదరాబాద్ నుంచి ఆంధ్రకు తరలించేటప్పుడు ఫర్నిచర్ పోయిందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు కూపీ లాగుతున్నారు. మరోవైపు అసెంబ్లీ‌కి చెందిన ఫర్నిచర్‌ను సత్తెనపల్లి, నరసరావుపేటకు తరలించారని ఆరోపణలు వస్తున్నాయి.

Related posts