telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పౌరసత్వ బిల్లుపై … ఉన్నత ఉద్యోగులు కూడా విముఖత.. ఐపీఎస్ రాజీనామా…

ips officer resignation on nrc bill pass

పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించడం పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమౌతోంది. చాలామంది ఈ బిల్లును స్వాగతిస్తుండగా, అదే స్థాయిలో నిరసనలు కూడా వ్యక్తమౌతున్నాయి. ప్రత్యేకించి ఈశాన్య రాష్ట్రాలు ఈ అంశం మీద భగ్గుమంటున్నాయి. అట్టుడికి పోతున్నాయి. అస్సాం, త్రిపురల్లో పెద్ద ఎత్తున హింసాత్మక పరిస్థితులు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందడాన్ని నిరసిస్తూ ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీనామా చేశారు. ఐపీఎస్ సర్వీసుల నుంచి వైదొలిగారు. దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ బిల్లును అమలు చేయడాన్ని నిరసిస్తూ తాను సర్వీసుల నుంచి తప్పుకొంటున్నట్లు ఆయన ప్రకటించారు. పౌరసత్వ సవరణ బిల్లుపై రాజ్యసభ ఆమోదముద్ర వేసిన నిమిషాల వ్యవధిలో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు.

ఆ ఐపీఎస్ అధికారి పేరు అబ్దుర్ రెహ్మాన్. మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన అధికారి ఆయన. మహారాష్ట్ర పోలీసు శాఖలో ఆయన ఐజీగా పని చేస్తున్నారు. తన సర్వీసుల నుంచి స్వచ్ఛందంగా వైదొలగుతున్నట్లు ఆయన వెల్లడించారు. రాజీనామా పత్రాన్ని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. దాన్ని మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ), కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయానికి పంపించనున్నట్లు చెప్పారు.

Related posts