దేశంలో కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంకిత భావంతో పని చేస్తున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పట్టణాల్లో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని అన్నారు. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లినవారే దీనికి కారణమనిప్పారు. ఈ ప్రార్థనలకు వెళ్లినవారు తెలంగాణతో పాటు అనేక ప్రాంతాలకు వెళ్లారని తెలిపారు. మరోవైపు ఇతర ఎమర్జెన్సీ కేసులు తగ్గిపోయాయని తెలిపారు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి అని చెప్పారు.
ఎవరికైనా ఏదైనా ఇతర జబ్బు వస్తే ఎక్కడకు వెళ్లాలో కూడా అర్థంకాని అయోమయం ప్రజల్లో నెలకొందని అన్నారు. ఆరోగ్యసేతు యాప్ లో వివరాలను పొందుపరిస్తే… రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతారని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సేవకులు ఉన్నారన్నారు. ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వీరికి ఫోన్ చేసి వైద్య సలహాలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ కు సహకరించకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు.
నా బయోపిక్ పై నాకు ఆసక్తి లేదు: గవాస్కర్