దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రైల్వే పరిసర ప్రాంతాల్లో మాస్క్ లేకుండా తిరిగేవారిపై రూ.500 జరిమానా విధించాలని నిర్ణయించింది.. రైల్వే చట్టం ప్రకారం ఈ శిక్ష ఉంటుందని పేర్కొంది రైల్వే శాఖ.. ప్రయాణికులు రైల్వే స్టేషన్లోకి ఎంట్రీ అయ్యే సమయంలో కానీ, రైలులో ప్రయాణం చేసే సమయంలో కానీ.. ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని స్పష్టం చేసింది.. లేని యెడల వారి నుంచి రూ.500 చొప్పున జరిమానా వసూలు చేయనున్నారు.. కరోనా కట్టడి కోసం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామని, ఇప్పుడు తాజాగా మాస్క్ ధరించిన వారిపై జరిమానా విధించనున్నట్లు రైల్వేశాఖ తన తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి రాగా.. ఆరు నెలల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది రైల్వే శాఖ. అయితే కరోనా సెకండ్ వేవ్ లో భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.. 80-90 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేకుండానే కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ జరుగుతోంది..
previous post