telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ముగిసిన రెండో రోజు ఆట.. 54 పరుగులకు వికెట్ కోల్పోయిన ఇండియా

చెన్నై వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట పూర్తయింది. అయితే ఈ మ్యాచ్ పై ఇప్పటికే భారత్ పట్టు బిగించింది.  రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీం ఇండియా వికెట్‌ నష్టపోయి.. 54 పరుగులు చేసింది. ఫలితంగా టీం ఇండియా 249 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయిన ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌… రెండో ఇన్నింగ్స్‌లోనూ నిరాశపరిచాడు. జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో గిల్‌ 14 పరుగుల వద్ద వికెట్ల ముందు దొరికిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రోహిత్‌ శర్మ 25 పరుగులతో.. చతేశ్వర్‌ పుజారా 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు రెండో రోజు 300-6 ఓవర్‌ నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీం ఇండియా.. మరో 29 పరుగులు మాత్రమే జోడించి చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌.. అశ్విన్‌ దెబ్బకు 134 పరుగులకే కుప్పకూలింది.

Related posts