telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

కోర్టులో ఎమ్మెల్యే వెకిలి నవ్వులు..న్యాయమూర్తి ఆగ్రహం

Megistrate fire to BJP MLA

కోర్టుకు హాజరైన ఓ ఎమ్మెల్యే హాల్లో పదేపదే నవ్వడాన్ని న్యాయమూర్తి తప్పుబట్టారు. కర్ణాటకలోని దేవదుర్గ బీజేపీ ఎమ్మెల్యే శివానగౌడ నాయక్‌కు కోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఓ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరైన ఆయన హాల్లో పదేపదే నవ్వడాన్ని గమనించిన న్యాయమూర్తి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రజాప్రతినిధి అయివుండి కోర్టులో ఎలా వ్యవహరించాలో తెలియకపోతే ఎలా? అని మందలించారు. కాసేపు కోర్టు కస్టడీలో ఉండాలని ఆదేశించారు. దీంతో వెంటనే శివానగౌడ నాయక్‌ న్యాయవాదులు జోక్యం చేసుకుని తమ క్లయింట్‌ చేసింది తప్పేనని  న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పించడంతో ఆయన శాంతించారు.

Related posts