telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఈసీ పట్టుకున్న నిధులు.. : 705కోట్ల డ్రగ్స్, నగదు 377 కోట్లు, మద్యం 157 కోట్లు.. ఇంకా..

ఎన్నికల అధికారులకు ఎప్పటి లాగానే పకడ్బందీగా నిఘా విధించారు. అయినా నేతలు వివిధ మార్గాలలో నగదు.. తదితర అంశాలతో ఓటరును మభ్యపెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తూనే ఉన్నారు. డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు కూడా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అయినప్పటికీ కొంత మంది అక్రమంగా యథావిధిగానే డబ్బులను తరలిస్తున్నారు.

NO ALCOHOL IN TELANGANAఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా పోలీసుల తనిఖీల్లో రూ.377 కోట్లు పట్టుబడినట్లు సమాచారం. డబ్బుతో పాటు రూ.157 కోట్లు విలువ చేసే మద్యం, రూ.705 కోట్ల విలువైన డ్రగ్స్‌ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎన్నికలకు సమయం ఉంది, అంటే ఇంకెంత దొరుకుతుందో ఊహకు కూడా అందదేమో.. ఇప్పటికే లెక్కలు చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. అయితే మరో విషయం గురించి తెలుసుకోవాల్సి ఉంది.. దొరికిన దానిలో సగం అధికారులు దారిమళ్లించి సగం మాత్రమే లెక్కల్లో చుపిస్తున్నారనేది.. ఇది కూడా నిజమని నమ్మితే, ఇప్పటికే యెంత దొరికిందో పై లెక్కలు తెలియజేస్తున్నట్టే, మరి ఏడు విడతలుగా జరగనున్న ఈ ఎన్నికలలో ఎంత ఈసీ పట్టుకుంటుందో .. !!

Related posts