చైనాలో పుట్టిన కరోనా వైరస్ విజృంభణ ఇండియాలోనూ కొనసాగుతోంది. ఇండియాలో రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 3,11,170 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా… కరోనా వల్ల మొత్తం 4,077 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 3,62,437 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,46,84,077 కాగా..ఇందులో 2,07,95,335 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 36,18,458 గా ఉన్నాయి. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 2,70,284 నమోదైంది.
							previous post
						
						
					


ఎన్నికల్లో జనసేన ఓటమి… స్పందించిన చరణ్