తెలంగాణ ప్రభుత్వం ఆధునిక హంగులతో శాసన సభ్యుల నివాసం కోసం నిర్మించిన క్వార్టర్స్ ప్రారంభానికి సిద్ధమయ్యాయి. నేడు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. సుమారు మూడు సంవత్సరాలపాటు అత్యంత సాంకేతిక నైపుణ్యతను జోడిస్తూ నిర్మించిన ఎంఎల్‌ఏల నివాసిత గృహాల్లో అనేక సదుపాయాలను ఏర్పాటు చేశారు. వేగవంతమైన ఇంటర్నెట్, ప్రతిగదిలో టివి, పటిష్టమైన భద్రతావ్యవస్థను చేశారు.
హైదర్‌గూడలో పాత ఎంఎల్‌ఏ క్వార్టర్స్‌ను కూల్చివేసి అదేప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా క్వార్టర్స్‌ను నిర్మించింది. గత పాలకులు మూడుప్రాంతాల్లో ఎంఎల్‌ఏల నివాసాలు ఏర్పాటు చేయగా అవిశిథిలాలుగా మిగలడంతో తెలంగాణ ప్రభుత్వం నామినేటెడ్ సభ్యుడుతో కలిపి 120 మంది శాసన సభ్యులు ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా భవనాన్ని నిర్మించింది. నాలుగు ఎకరాల 26 గుంటల స్థలంలో 12 అంతస్తుల్లో ఎంఎల్‌ఏ క్వార్టర్స్‌ను సిఎం కెసిఆర్ ప్రత్యేకశ్రద్ధతో నిర్మించినఈ ఈ ప్రాంగనానికి నిర్మాణ వ్యయం రూ.166కోట్లు వెచ్చించారు. విశాలమైన కారిడార్లతో ప్రతి క్వార్టర్ 2500 చదరపుగజాల విస్తీర్ణంలో నిర్మించారు.
ఒక్కో క్వార్టర్‌లో మాస్టర్ బెడ్‌రూం అటాచ్‌డ్ టాయిలెట్, చిల్డ్రన్స్ బెడ్‌రూం అటాచ్‌డ్ టాయిలెట్, పూజా గది, స్టోర్ రూం, డైనింగ్ హాల్ తో పాటు గెస్ట్ బెడ్‌రూం, కామన్ టాయిలెట్, ఆఫీసు గది ఉంది. వీటితో పాటు పైకి వాహనాలు కనిపించకుండా సెల్లార్‌లో కార్‌పార్కింగ్ ఏర్పాటు చేశారు. మొదటి సెల్లార్‌లో 81 కార్లు,రెండవ సెల్లార్‌లో 94 కార్లు, మూడవ సెల్లార్‌లో 101 కార్లను పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే ద్విచక్రవాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యంకూడా ఉంది.
పారదర్శక పాలన అందించేందుకు జగన్ కృషి