telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌ తప్పు చేయకపోతే అసెంబ్లీ సమావేశాలకురావాల్సిందే: కల్వకుంట్ల కవిత

కల్వకుంట్ల కవిత రాజకీయంగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

ఈరోజు మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కవిత మాట్లాడుతూ.. ఈ సమావేశాలకు కేసీఆర్ వచ్చి సమాధానాలు చెప్పకపోతే బీఆర్‌ఎస్ పని ఖతం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‌ తప్పు చేయకపోతే సభకు రావాల్సిందే అని పట్టుబట్టారు. సభకు రాకుండా పిల్ల కాకుల మీద సభా సమయాన్ని వదలొద్దంటూ హితవుపలికారు…

రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టిన కేసీఆర్‌‌ను ఉరి తీయాంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కవిత స్పందించారు.

కేసీఆర్ మీద సీఎం భాష సరికాదన్నారు. కేసీఆర్‌ను ఒకసారి ఉరితీయాలంటే రేవంత్ రెడ్డిని పదిసార్లు ఉరి తీయాలంటూ మండిపడ్డారు.

సొంత జిల్లా మహబూబ్ నగర్‌కు రేవంత్ తెచ్చిన ప్రాజెక్టులు ఎన్ని అని ప్రశ్నించారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును ఉద్దేశించి కవిత మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశారు.

ఆయనకు ప్యాకేజీలు తీసుకోవడం తప్ప ఏం తెలుసు అంటూ హరీష్‌ను టార్గెట్ చేస్తూ కవిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది.

కేసీఆర్‌ సభకు రాకపోతే హరీష్ రావే అన్నీ చూసుకోవడం సరికాదని.. కేసీఆర్ సభకు వచ్చి సమాధానం చెప్పాలని కవిత వ్యాఖ్యలు చేశారు.

Related posts