ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యూందాయ్ ఇండియా అన్ని మోడళ్లపై వచ్చే ఏడాది జనవరి నుంచి ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. కార్ల తయారీకి కావాల్సిన ముడి సరుకుల ధరలు పెరగటంతో ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. అయితే, ఈ ధరల పెరుగుదల ఎంత మేరకు ఉంటుందన్నది స్పష్టం చేయలేదు.
ఈ మేరకు కంపెనీ ప్రతినిధి ఒక ప్రకటన చేశారు. దేశంలోనే తొలి స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్ అందజేస్తున్న హ్యూందాయ్ మోటార్స్ ఇండియా జనవరి 2020 నుంచి అన్ని మోడళ్లపై ధరలను పెంచుతోంది. ముడిసరుకుల ధర పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.