డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పెట్టుబడుల స్వర్గదామం హైదరాబాద్. జీహెచ్ఎంసీ ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. రాష్ట్రంలోని జనాభాలో 1/3 వంతు జనాభా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. రాజ్యాంగంలోని 243-యు3ఏ ప్రకారం జీహెచ్ఎంసీ కి పదవీకాలం ముగిసిలోపు ఎన్నికలు నిర్వహించాలి. పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తం అని తెలిపారు. ఎన్నికల ప్రిపరేషన్, ప్రచురణ, ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తోంది.150 వార్డుల వారిగా తుది ఓటర్ల జాబితా విడుదల చేశాం. రాజకీయ పార్టీల అభిప్రాయాలను, సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం బ్యాలెట్ పద్దతిలో ఎన్నికల నిర్వహణ ఉంటుంది అని సూచించారు. ఈ ఎన్నికల్లో తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు వినియోగిస్తాం అని తెలిపారు. అయితే ఈసారి మేయర్ పదవికి మహిళను ఎంపిక చేయాలని నిర్ణయించారు. మేయర్ పదవికి జనరల్ కేటగిరిలో మహిళకు అవకాశం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి మేయర్ కాబోయే ఆ మహిళా ఎవరు అనేది.
							previous post
						
						
					
							next post
						
						
					

