telugu navyamedia
తెలంగాణ వార్తలు

పోలీసుల ఆధ్వర్యంలో జాబ్ మేళా..

జాబ్‌ కనెక్ట్‌ పేరిట నిర్వహించే ఉద్యోగ మేళాతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్ అన్నారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో అమీర్ పేట్ లోని మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ జాబ్ మేళాలో 22 కంపెనీలు దాదాపు 2 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీపీ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ‘పోలీస్ డిపార్ట్మెంట్ కేవలం జనరల్ డ్యూటీ లే కాదు వారి సామర్థ్యం మేరకు సేవ చేయాలనే సీఎం కేసీఆర్ సంకల్పంతో ఇలాంటి జాబ్ మేళా లు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న జాబ్ మేళా లో ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. అందులో 25 వేల మందికి జాబ్స్ వచ్చాయి. ఇది ఒక ప్రపంచ రికార్డ్ అవుతుందని’ చెప్పారు.

‘ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ మేళాలు నిర్వహించదు. జాబ్ వచ్చినపుడు ఇది నాకు తగిన జాబ్ కాదు, నాకు ఇంకా మంచి జాబ్ రావాల్సింది అని అనుకోకూడదు, ఇది మీ మొదటి ప్రయత్నంలో వచ్చింది.  వచ్చిన ఈ అవకాశాన్ని మీరు అనుకూలంగా మలుచుకోవాలి. ప్రతి ఒక్కరూ సానుకూలంగా ఆలోచించండి. నెగెటివ్ ఆలోచనలు తీసేయండి. ఇంకా భవిష్యత్ లో మంచి శిఖరాలకు ఎదుగుతారు. జీవితమనేది ఓ పెద్ద జర్నీ లాంటిది. ఈ ఒక్క అడుగుతోనే మీ కెరియర్​ ప్రారంభమవ్వాలి.

ఇలాంటి జాబ్ మేళా నిర్వహిస్తున్నామంటే ఇది 40 రోజుల శ్రమకు ఈ రోజు మన ముందు ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ ప్రకారం ప్రతీ ఒక్క డివిజన్ లో పోలీసుల కాంట్రిబ్యూషన్ ఉంటుందన్నారు.

 

Related posts