telugu navyamedia
క్రైమ్ వార్తలు

జ‌పాన్‌ను వ‌ణికించిన భారీ భూకంపం : నలుగురు మృతి

జపాన్‌లో భారీ భూకంపం ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. బుధవారం  రాత్రి ఈశాన్య జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3గా నమోదైంది.  దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

సముద్ర అడుగుభాగంలో 60 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. భూకంప ప్రభావంతో జపాన్ రాజధాని టోక్యో సహా పలు నగరాల్లోని ఇళ్లు భారీ కుదపులకు లోనయ్యాయి. దాదాపు 20 లక్షలకు పైగా ఇళ్లలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. భూకంపం సంభవించిన వెంటనే అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు.

2011 మార్చి11న కూడా భారీ భూకంపం ఏర్పడింది. నార్త్‌ఈస్ట్ జపాన్‌లో ఓషికాకు 70 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై 9 తీవ్రతతో సముద్ర గర్భంలో 24 కిలోమీటర్ల లోతులో భూకంపం ఏర్పడింది. భూకంపం ఏర్పడిన 20 నిమిషాల్లోనే భారీ సునామీ విరుచుకుపడింది. ప్రజలు ఆ ప్రాంతాలను ఖాళీ చేయడానికి కూడా సమయం దొరకలేదు. అలల బీభత్సానికి ఇళ్లు పేక మేడల్లా కూలిపోయాయి. ఫలితంగా ఆ రోజు 15 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అది ప్రపంచంలోనే 4వ భారీ భూకంపం. 

ఇప్పుడు కూడా సముద్రం గర్భంలోనే 7.3 తీవ్రతతో భూకంపం సంభవించవించడం వల్ల దేశ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నట్లు సమాచారం.

భూకంపం కారణంగా నలుగురు మరణించారు. మరో 97 మంది గాయపడ్డారు. వారి మరణానికి గల కారణాలను తెలుసుకుంటాం. ప్రభుత్వం భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేస్తోన్నారు అధికారులు.

Related posts