telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అయ్యన్నపాత్రుడి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు.. నర్సీపట్నంలో హైటెన్షన్

*నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు ఇంటి వ‌ద్ద హైటెన్షన్
*జేబీసీల‌తో గొడ‌ను తొల‌గించిన మున్సిపల్ సిబ్బంది..
* అయ్యన్న ఇంటికి స‌మీపంలో చెక్ పోస్ట్ ఏర్పాటు..

నర్సీపట్నంలో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన ఇంటి భాగంలో ఉన్న గోడను నర్సీపట్నం మునిసిపల్ సిబ్బంది జేసీబీతో కూల్చేశారు. 

పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని.. ప్రభుత్వ భూమిలోని రెండు సెంట్లు ఆక్రమించారని న‌నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ నోటీసులో పేర్కొన్నారు.

అయితే  ఈ నెల 2వ తేదీతో ఉన్న నోటీసును శ‌నివారం ఇచ్చి, తెల్లారే వచ్చి కూల్చివేతలు చేయడంపై అయ్యన్న కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.

chintakayala ayyanna patrudu house: Narsipatnamలో హై టెన్షన్, భారీగా పోలీసుల మోహరింపు.. మాజీ మంత్రి అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత - high tension near ex minister chintakayala ayyanna patrudu ...

మరోవైపు అయ్యన్న ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. మీడియాకు అనుమతి లేదంటూ పోలీసులు మీడియాను అడ్డుకున్నారు. అయ్యన్నపాత్రుడు ఇంటికి స‌మీపంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు.

దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్దయెత్తున అక్కడకు చేరుకుని పోలీసులు, మున్సిపల్ సిబ్బంది వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయ్యన్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టడంతో అనకాపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

అయ్యన్న అరెస్ట్‌కు రంగం సిద్దం..!

గత కొంతకాలంగా అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులపై చేస్తున్న వ్యాఖ్యలపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయనపై కేసులు కూడా నమోదు చేశారు. అయ్యన్నపై ఇప్పటికే 12 కేసులు నమోదయ్యాయి. ఆయనపై నిర్బయ కేసు కూడా ఉంది. నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై ఈ కేసు నమోదు చేశారు.

ఇటీవల చోడవరంలో జరిగిన టీడీపీ మినీ మహానాడులో మంత్రి రోజా, పోలీసులతో పాటుగా సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. 

 

Related posts