telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

గ్లామ‌ర్ పాత్ర‌ల‌పై లక్ష్మీరాయ్ కీలక వ్యాఖ్యలు…

Lakshmi-Rai

లారెన్స్ హీరోగా వచ్చిన కాంచన సినిమాతో మంచి గుర్తింపు పొందింది లక్ష్మీరాయ్. అయితే గ్లామ‌ర్ పాత్ర‌ల ప్ర‌త్యేక న‌టిగా, అందచందాల ఆర‌బోత‌లో త‌న‌కు తానే సాటి అన్నంత బోల్డ్‌గా ప్ర‌ద‌ర్శ‌న‌ చేస్తుంది లక్ష్మీరాయ్. లక్ష్మీరాయ్ కొంత గ్యాప్ తీసుకున్న త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల‌పై ఆమె మ‌ళ్లీ దృష్టి సారించారు. త‌మిళ‌, మ‌ల‌యాళ చిత్రాల‌పై ఆమె తాజాగా దృష్టి సారించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ గ్లామ‌ర్ పాత్ర‌ల‌పై త‌న‌వైన అభిప్రాయాల‌ను నిర్మొహ‌మాటంగా వెల్ల‌డించారు. లక్ష్మీరాయ్ మాట్లాడుతూ.. ‘అందాల ప్రదర్శనకో, అభినయ ప్రధాన పాత్రలకో పరిమితవడానికి నేను సినీ పరిశ్రమలో అడుగుపెట్టలేదు. ఒకే విధమైన మూస పాత్రల్లో కనిపించడం నాకు ఇష్టం ఉండదు. కొన్నిసార్లు పాత్రలకు తగినట్లుగా బోల్డ్‌గా కనిపించాల్సి వస్తుంది. నాయికగా ఏం చేసినా అదంతా నటనలో ఓ భాగం మాత్రమే.. అది తప్పు ఎం మాత్రం కాదని అభిప్రాయపడింది. కథానాయికగా అన్ని రకాల పాత్రలు పోషించాలన్నదే నా లక్ష్యం అంటూ లక్ష్మీరాయ్ చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడుకి తెలుగులో ఎక్కువగా అవకాశాలు రావడం లేదు.

Related posts