telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హార్ట్‌ టచింగ్‌ వీడియో… “బుట్టబొమ్మ” టిక్ టాక్ వీడియోపై బన్నీ

Butta

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో పాటలు, వాటిలో బన్నీ వేసిన స్టెప్స్ అదిరిపోయాయి. ‘బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టూకుంటివే’.. అంటూ సాగే మెలోడీ సాంగ్ క్లాస్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. థమన్ తనదైన శైలిలో సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్యశాస్త్రి లిరిక్స్‌రాయగా.. అర్మాన్‌ మాలిక్‌ ఆలపించాడు. ముఖ్యంగా బన్నీ ఈ పాటలో వేసిన స్టెప్స్‌ను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా అనుసరిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ షేర్ చేసిన ‘బుట్టబొమ్మ’ టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఆడిపాడుతోంది ఇద్దరు దివ్యాంగులు. కాళ్లు లేని వ్యక్తి ‘బుట్టబొమ్మ’ అంటూ డ్యాన్స్‌ చేయగా దానికి చేతులు లేని యువతి కాలు కదిపింది. దీనిపై బన్నీ స్పందిస్తూ ‘హార్ట్‌ టచింగ్‌ వీడియో.. సంగీతం మనిషి వైకల్యాన్ని మర్చిపోయేలా చేస్తుందని ఈ వీడియో నిరూపించింది’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. థమన్ ‘మై హార్ట్ గోస్ టు దిస్ వన్.. లవ్లీ వీడియో.. గాడ్ బ్లెస్’ అంటూ రీ ట్వీట్ చేశాడు. ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి కూడా ఈ సాంగ్‌ను టిక్ టాక్ చేసి చేసిన సంగతి తెలిసిందే.

Related posts