బాలీవుడ్ లో డ్రగ్స్ కుంభకోణంపై బీజీపీ ఎంపీ రవికిషన్ సోమవారం చేసిన ప్రకటనపై మంగళవారం సమాజ్‌వాదీ పార్టీ జయాబచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్‌లో డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉందని, దీనిపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు సరైన పద్ధతిలోనే దర్యాప్తు చేస్తున్నారని రవికిషన్ అన్నారు. ఆయన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ అంశంపై మంగళవారం రాజ్యసభలో మాట్లాడి జయాబచ్చన్ రవికిషన్ వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు. సినీ పరిశ్రమలో ఉండి ఇండస్ట్రీ గురించే తప్పుగా మాట్లాడుతూ కొందరు తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారని జయాబచ్చన్ చురకలు వేశారు. ఎవరో కొందరు చేస్తున్న పనులను బూచిగా చూపి ఇండస్ట్రీ మొత్తాన్ని విమర్శించడం సరికాదన్నారు. జయా బచ్చన్ వ్యాఖ్యలను కొందరు సమర్ధిస్తుంటే.. కొందరు మాత్రం తప్పుబడుతున్నారు. బాలీవుడ్‌ను ఇండియన్ సినిమా ఇండస్ట్రీగా ప్రొజెక్ట్ చేసేందుకు జయాబచ్చన్ ప్రయత్నిస్తున్నారంటూ ఘాటుగా ట్వీట్ చేశారు నటి కస్తూరి. “జయా బచ్చన్ గారు.. బాలీవుడ్ మాత్రమే భారత సినీ పరిశ్రమ కాదు.. బాలీవుడ్ డ్రగ్స్ మాఫియా లింకులను మొత్తం సినిమా పరిశ్రమకు ఆపాదించకండి. డ్రగ్స్ తీసుకునే వారు లూజర్స్ కాదు.. జెలసీతో తీసుకుంటున్నారు.. వారంతా ఎంతో సాధించినవారే” అని కస్తూరి ట్వీట్‌లో పేర్కొంది. నిజాయితీగా మాట్లాడాల్సి వస్తే.. సుశాంత్ సింగ్ మరణంపై మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నవారే శిక్షార్హులు. బాలీవుడ్‌లో డ్రగ్స్‌కు సంబంధించిన వార్తలు రావడం కొత్తేమీ కాదు.. షూటింగ్ చేస్తూ కొంతమంది పట్టుబడ్డారు. జింకలు వేటాడుతూ కొందరు, జనాలపై కార్లను ఎక్కించే వారు కూడా ఉన్నారంటూ సల్మాన్ ఖాన్‌ను మధ్యలోకి లాగింది కస్తూరి. దీంతో సల్మాన్ అభిమానులు కస్తూరిపై ఫైర్ అవుతున్నారు.
Respected Jaya Bachchan ji
*Bollywood* is not entire film industry.
Bollywood drug link exposed is not slur on entire film industry.
Those commenting are not losers doing it out of jealousy, they are successful actors with inside info & genuine concern— Kasturi Shankar (@KasthuriShankar) September 15, 2020
అది నిజజీవితంలో నా తల్లి పాత్ర : సాయి ధరమ్ తేజ్