telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినీ పరిశ్రమను వదలని కరోనా.. మరో స్టార్‌ హీరోకి పాజిటివ్‌

చైనా నుండి వచ్చిన కరోనా మనదేశాన్ని దాదాపుగా ఏడాది నుండి అతలాకుతలం చేస్తుంది. అయితే ఈ ఏడాది జనవరి నుండి కరోనా కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే ఇప్పటికే మన దేశంలో చాలా మంది రాజకీయనాయకులకు, సెలబ్రెటీలకు కరోనా సోకింది. ఇక తాజాగా ఈ కరోనా మాధవన్ ను కూడా సోకింది. కరోనా బారిన పడిన మాధవన్ ఆ విషయాన్ని ఫన్నీగా తెలియచేశాడు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్‏తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. కామెంట్ పెట్టాడు. వీరిద్దరు కలిసి హిందీలో త్రి ఇడియట్స్ సినిమాలో నటించారు. అందులోని వీరి పేర్లను అనుసరిస్తూ.. “రాంచో (3 ఇడియట్స్ సినిమాలో అమీర్ పేరు)ను ఫర్హాన్ (మాధవన్ పేరు)ఫాలో అవుతుంటే.. వైరస్ (సినిమాలో బోమన్ ఇరానీ) మా ఇద్దరి వెంట పడేవాడు.. అయితే ఈసారి అతడికి మేము చిక్కాము. అంటే అర్థం కరోనాకి చిక్కాము. ఆల్ ఈజ్ వెల్. తర్వలోనే ఈ మహామ్మారికి చెక్ పడుతుంది. ఇందులోకి మాతోపాటు రాజు రావోద్దని అనుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది” అంటూ రాసుకోచ్చారు మాధవన్

Related posts