telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఉడికించిన గుడ్లను తింటున్నారా… అయితే ఈ విషయాలు తెలుసుకోండి !

Egg

మనం ఆరోగ్యంగా ఉండటానికి చాలా రకాల పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు తీసుకుంటాం. అలాంటి ఆహారం తీసుకుంటేనే మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. అందుకే ఎలాంటి వారైనా మంచి ఆహారం తీసుకోవడానికే ప్రయత్నాలు చేస్తారు. అయితే.. అందరికీ అందుబాటులో ఉంటూ.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవి గుడ్లు. గుడ్లను ఉడకబెట్టి తింటే పోషకాలు బాగా అందుతాయి. అయితే.. గుడ్లను ఉడకబెట్టి చాలా మంది లేట్‌గా తింటారు. వాస్తవానికి అలా చేయకూడదు. అలా చేస్తే.. గుడ్డుపై వైరస్‌, బ్యాక్టీరియాలు చేరి అవి త్వరగా కలుషితమయ్యే అవకాశం ఉంది.
నీళ్లలో ఉడికిన గుడ్లను ఒకపూట వరకు బయట ఉంచవచ్చు. కానీ పూట గడవక ముందే పొట్టు తీసి తినటం మంచింది. ఒకవేళ ఇంట్లో ఫ్రిజ్‌ ఉన్నట్లయితే… అందులో గుడ్లు పెట్టాలనుకుంటే పొట్టు తీయకుండా వారం రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. కానీ ఆ తర్వాత తినాలి. ఒకవేళ ఫ్రిజ్‌ లో పొట్టు తీసి గుడ్లు స్టోర్‌ చేసినట్టయితే.. మూడు, నాలుగు రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. అయితే.. ఉడికించిన గుడ్లను గాలి దూరని ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేస్తే గుడ్లు పాడవకుండా ఉంటాయి.

Related posts