హరీష్ శంకర్ 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంలో మరో చిత్రానికి ఓకే చెప్పిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది. కాగా ఈ మూవీని మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కించాలని హరీష్ శంకర్ అనుకుంటున్నారట. ఈ క్రమంలో ఇద్దరు యంగ్ హీరోలను ఆయన లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఫిలింనగర్ వర్గాల ప్రకారం.. నితిన్, సాయి తేజ్‌లను ఈ మల్టీస్టారర్ కోసం హరీష్ తీసుకున్నారట. దీనికి సంబంధించి ఆ హీరోలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే టాలీవుడ్‌లో మరో క్రేజీ మల్టీస్టారర్ లైన్‌లో ఉన్నట్లే. కాగా ఇందులో సాయి ధరమ్ తేజ్‌తో ఇదివరకు హరీష్ శంకర్ పూర్తి స్థాయి సినిమాకు పనిచేశారు. వీరి కాంబోలో సుబ్రమణ్యం ఫర్ సేల్ తెరకెక్కగా.. అది పెద్ద విజయాన్ని సాధించింది. ఇక నితిన్, హరీష్ శంకర్ కాంబోలో ఇప్పటివరకు ఒక్క సినిమా రానప్పటికీ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ తెరకెక్కించిన గద్దలకొండ గణేష్‌లో నితిన్ కెమెరా అప్పియరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో ఓ చిత్రానికి కమిట్ అయిన విషయం తెలిసిందే.