telugu navyamedia
రాజకీయ వార్తలు

తిరుమలలో మంత్రి హరీశ్ రావుకు చేదు అనుభవం!

harish rao trs

వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు స్వామిని వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకున్నారు. ఏకాదశి సందర్భంగా 4,004 పాసులు జారీ చేసిన టీటీడీ ముందుగా వీఐపీలకు వైకుంఠ ద్వారా దర్శన భాగ్యాన్ని కల్పించింది. ఈ క్రమంలో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు తిరుమలలో చేదు అనుభవం ఎదురైంది. ఓ రాష్ట్ర మంత్రిగా ఆయనకు లభించాల్సిన టీటీడీ ప్రొటోకాల్ ను కల్పించడంలో అధికారులు విఫలం అయ్యారు.

అధికారుల తీరుతో మనస్తాపానికి గురైన హరీశ్ రావు స్వామి దర్శనానికి వెళ్లేందుకు నిరాకరించారు.విషయం తెలుసుకున్న టీటీడీ పాలకమండలి సభ్యుడు దామోదర్, హరీశ్ రావును దగ్గరుండి స్వామి దర్శనానికి తీసుకెళ్లారు. రద్దీ, వీఐపీల తాకిడి అధికంగా ఉండటంతో పాటు, హరీశ్ రాకపై పూర్తి సమాచారం లేనందునే అలా జరిగిందని వివరణ ఇచ్చారు.

Related posts