telugu navyamedia
వార్తలు సామాజిక

ట్విట్టర్ లో వాయిస్ ట్వీట్ ఫీచర్!

twitter logo

ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ ఓ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇకపై వాయిస్ ట్వీట్లు చేసుకునే సదుపాయాన్ని ఈ ఫీచర్ ద్వారా పొందవచ్చు. అంటే మాటలే ట్వీట్లుగా మారతాయి. టైపింగ్ చేయాల్సిన అవసరం లేకుండా, ట్వీట్ చేయాల్సిన సందేశాన్ని పలికితే చాలు, అది ట్వీట్ గా రూపాంతరం చెందుతుంది.

అయితే ఇందుకు ఓ పరిమితి ఉంది. సింగిల్ వాయిస్ ట్వీట్ నిడివి 140 సెకన్లు మాత్రమే. ఆ వ్యవధిలో ఎన్ని పదాలు పలికితే అన్ని పదాలు ట్వీట్ అవుతాయి. ట్వీట్ కంపోజర్ స్క్రీన్ పై ఈ ఫీచర్ కోసం ‘వేవ్ లెంగ్త్స్’ అనే ఆప్షన్ పొందుపరిచారు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ను ప్రయోగాత్మకంగా పరిమిత సంఖ్యలో ఆపిల్ ఐఓఎస్ యూజర్లకు అందించనున్నారు.

Related posts