telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఆధ్యాత్మికతతోనే మనశ్శాంతి…

డిజిటల్ యుగంలో సెల్ ఫోన్లతో బిజీగా మనశ్శాంతి లేకుండా జీవితాన్ని గడుపుతున్న జనానికి భగవంతుని స్మరణతోనే సాధ్యమని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఆర్యవైశ్య సేవసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాస లక్ష దిపోత్సవంలో ఆయన భాగస్వామ్యమయ్యారు. కార్తీక దీపోత్సవ వేడుకలతో గజ్వేల్ లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

దీపోత్సవ ప్రాంగణం వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక అనుభూతినిచ్చింది. పురాణ ప్రవచాలు చెబుతున్న స్వామీజీకి నమస్కరించిన హరీశ్ రావు, కాసేపు నేలపై భక్తులతోపాటు కూర్చొని ప్రవచనాలు విన్నారు. లోక కళ్యాణంకోసం లక్షదీపోత్సవ నిర్వహించిన ఆర్యవైశ్య సంఘాన్ని ప్రత్యేకంగా అభినందించారు. దీపోత్సవ ప్రాంగణంలో పాలరాతి శివలింగానికి అభిషేకపూజలు నిర్వహించి పుష్పార్చన చేశారు. ప్రజలు సెల్ ఫోన్ లలో తమ సమయం గడపడం విడిచి పెట్టి, ఇలాంటి కార్యక్రమలలో పాల్గొని పునీతులుకావాలని ఆయన ఆకాంక్షించారు.

యాదాద్రి దేవాలయం వచ్చే నూతన సంవత్సరంలో ప్రారంభించుకోబోతున్నాం , అత్యాద్భుతంగా నిర్మిస్తున్న యాదాద్రి దేవాలయ శిఖరనికి చాలామంది దాతలు బంగారం సమర్పిస్తున్నారని, మా ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డి, ఒంటేరు ప్రతాప్ రెడ్డి , గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్త తమ వంతు దేవాలయ శిఖర నిర్మాణానికి కిలో బంగారం ఇస్తామని ముందుకురావడం అభినందనీయమన్నారు. యాదాద్రి శిఖర నిర్మాణానికి గజ్వేల్ , సిద్దిపేట ప్రజలు సహకరించాలని అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి , ఎమ్యెల్యే క్రాంతి కిరణ్, ఒంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts