telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

నారా లోకేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసిన మెగాస్టార్ చిరంజీవి

ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా మంత్రికి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి కూడా ఏపీ మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ప్రియమైన నారా లోకేష్ .

ఏపీ మరింత అభివృద్ధి సాధించడం కోసం , తెలుగు ప్రజలకు సేవ చేయాలనే మీ అభిరుచి, నిర్విరామ కృషి హర్షణీయం.

మీ అన్ని ప్రయత్నాలలో విజయం సాధించాలి’’ అంటూ చిరంజీవి ఎక్స్లో పోస్టు చేశారు.

లోకేష్‌ కు రాజకీయ, సినీ ప్రముఖులు బర్త్డే విషెస్ చెబుతున్నారు. అలాగే టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కూడా లోకేష్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు టీడీపీ నేతలు. ఆయా నియోజకవర్గాల్లో కేక్ కటింగ్ చేసి, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు.

Related posts