telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

బీజేపీ కార్యకర్త పై కొందరు హత్యాయత్నం

మన దేశంలో రోజురోజుకు దారుణాల సంఖ్య పెరిగిపోతోంది. బయటకు రావాలంటే నాయకుల సైతం ఆలోచించాల్సిన పరిస్థితి. అయితే ఇటువంటప్పుడు సామాన్య ప్రజానికం మానసిన పరిస్థితి ఎలా ఉంటుంది. ఇటీవల కర్ణాటవలోని మంగళూరు ప్రాంతంలో భారత జనతా పార్టీ(బీజేపీ) కార్యకర్తపై కొందరు హత్యాయత్నం చేశారు. ఈ ఘటన స్థానిక ఫొటో స్టూడియోలో చోటుచేసుకుంది. చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఘటనా స్థలానికి చురుకున్నారు. అప్పటికే ఆ బీజేపీ నేత రక్తం మడుగులో పడి ఉండటంతో, స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని పోలీసులు తెలిపారు. స్థానిక ఎస్2పీ బీఎం లక్ష్మీ ప్రసాద్ దీనిపై మాట్లాడారు. ‘దినేష్ బీజేపీకు ప్రొఫెషనల్ ఫొటో గ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఫరాంగీపేటలో ఉన్న ఫొటో స్టూడియోలో దుండగులు అతడిపై దాడి చేశారు. వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాం. వారిని విచారించగా వారు మొహమ్మద్ అర్షాద్, అబ్దుల్ రెహ్మాన్, మొహమ్మద్ సైఫుద్దీలుగా గుర్తించామ’ని ఆయన చెప్పారు. అసలు దాడికి గల కారణాలు వారు ఇంకా చెప్పలేదని అన్నారు.

Related posts