బీజేపీ పార్టీ గెలుపు కోసం అలాగే కొన్ని రాష్ట్రాలలో పట్టుకోసం తీవ్రంగానే ప్రయత్నిస్తుంది. దీనికోసం తాజాగా, తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసింది. వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్తులకు ఆహ్వానం పలుకుతోంది. తాజాగా మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు దాదాపు 20 మంది ముఖ్య నేతలతో బీజేపీ మంతనాలు జరుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయనున్నారు. ఈ జాబితా విడుదలైన తర్వాత రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంది. అసంతృప్తులు ఇప్పటికే అన్ని పార్టీలలో ఉండటంతో.. వారి చూపు సహజంగా బీజేపీ వైపు ఉండనుంది. దానిని బీజేపీ క్యాష్ చేసుకునేందుకు చూస్తుంది.
రాష్ట్రంలోని ప్రతి వ్యవస్థను నాశనం చేశారు: చంద్రబాబు