బీజేపీ పూటకు ఒకలా మాట్లాడటం సరికాదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను, ఉద్యమాన్ని అవహేళన చేసే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. నిజాలు తెలుసుకొని తెలంగాణ ప్రజలను గౌరవించేలా మాట్లాడితే మంచిందని హితవుచెప్పారు.
నాడు ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న సుష్మా స్వరాజ్ మద్దతు ఇవ్వడం వలనే పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యిందని గుర్తుచేశారు. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలనే కాదు.. సుష్మా స్వరాజ్‌ని కూడా కించపరిచేలా మాట్లాడారని అన్నారు. మోడీ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలన్నారు.