telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

రాష్ట్రానికి పట్టిన మద్యం మత్తు..వదిలితేనే అత్యాచారాలు ఆగుతాయి.. : మహిళా సంఘాలు

liquor shops ap

రాష్ట్రంలో దిశ ఘటన తరువాత మద్యం నియంత్రించాలని సర్వత్రా చర్చ జరుగుతుంది. మద్యం నియంత్రించడంతో పాటు బెల్ట్ షాపులను ఎత్తివేయాలని పలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో మద్యం నుంచి ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంపై కూడా అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో నవంబర్ 1వ తేదీ నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. ఈ పాలసీలో 5వేల జనాభాకు ఇక మద్యం షాపును కేటాయించింది. దీనివల్ల మద్యం షాపులను సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మద్యం నుంచి భారీగా ఆదాయం కూడగట్టుకునేందుకు ప్రభుత్వం యోచించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాపంపిణీ వ్యవస్థలో సబ్సిడీ బియ్యం ఒక్కొక్కరికీ ఆరు కిలోల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి అదనపు భారాన్ని మద్యం నుంచి భర్తీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీన్నిబట్టి మద్యంపై ప్రభుత్వం ఏ మేరకు ఆధారపడిందో అర్ధమౌతుంది. కానీ మద్యం వల్ల చాలా మంది ఆరోగ్యంతో పాటు అనర్థాలు కూడా జరుగుతున్నాయని పలువురు నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అమల్లోకి వచ్చిన నాటి నుంచి మద్యం విక్రయాలు గతేడాదితో పోల్చితే చాలా పెరిగినట్లు తెలిసింది. నవంబర్ 1వ తేదీ నుంచి 15 వ తేదీ వరకూ 20.76లక్షల కార్టన్ల మద్యం విక్రయించినట్లు అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం తెలుస్తున్నది. గతేడాది ఇదే నెలలో 12.90లక్షల కార్టన్ల మద్యం విక్రయించింది. దీన్నిబట్టి ఈ ఏడాది మద్యం విక్రయాలు పెరిగినట్లు తెలుస్తున్నది. బీర్ల అమ్మకాల్లోనూ ఇదే స్థాయిలో ఉన్నాయి. నవంబర్ 1 వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ 24.02లక్షల కార్టన్లను విక్రయించగా, గతేడాది 15.95లక్షల కార్టన్లను అమ్మినట్లు అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం తెలుస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వం ఈ ఏడాది మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు ఫీజును కూడా భారీగా పెంచింది. గత పాలసీలో దరఖాస్తు ఫీజు ఒక లక్ష రూపాయలుండగా, ఈ పాలసీలో రూ.2లక్షలకు పెంచింది. దీని ద్వారా రూ.900కోట్ల ఆదాయం రాబట్టింది. దీన్నిబట్టి మద్యం అమ్మకాలను ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సహిస్తుందో అర్థమౌతుంది.

Related posts