ప్రస్తుతం తెలంగాణలో అందరూ చూసేది ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల కోసం. అయితే ఇంకా ఈ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొదటి ప్రాధాన్యత ఓటులో ఎవరికీ 51శాతం మెజారిటీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును మొదలుపెట్టారు. ఇప్పటి వరకు మొత్తం 37 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. టిఆర్ఎస్ అభ్యర్థి 8,021 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. టిఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 1,12,689 ఓట్లు సాధించగా, బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు కు 1,04,668 ఓట్లు సాధించారు. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. రెండో ప్రాధ్యాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి కనీసం 24 గంటల సమయం పడుతుందని, ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ ఫలితం తేలకుండా మూడో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా చేపట్టాల్సిన అవసరం ఉందని అధికారులు చెప్తున్నారు. అధికారులు నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మూడో ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కించాల్సి రావొచ్చని, ఫలితాలు శనివారం రాత్రికి వరకు వస్తాయని అంటున్నారు. అయితే చూడాలి మరి శనివారం వరకు ఈ ఫలితాలు వస్తాయా… లేదా అనేది.
previous post