telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

యూఎస్ లో కోల్పోయిన 66 లక్షల ఉద్యోగాలు.. నిరుద్యోగభృతి కోసం ధరఖాస్తులు

job interview

అమెరికాలో కరోనా దెబ్బకు ఉద్యోగ సంక్షోభం ఏర్పడింది. కోవిడ్ -19 కారణంగా నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, తాము ఉపాధిని కోల్పోయామని క్లయిమ్ చేసిన వారి సంఖ్య 1.70 కోట్లను దాటింది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 4తో ముగిసిన వారాంతానికి మొత్తం 66 లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారని, యూఎస్ కార్మిక విభాగం వెల్లడించింది. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు 2.3 ట్రిలియన్ డాలర్లతో ఉద్దీపనను ప్రకటించినట్టు ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ వెల్లడించారు.

ఒకసారి కరోనా భయం తగ్గితే రికవరీ శరవేగంగా ఉంటుందని ఆయన అంచనా వేశారు. ఇక యూఎస్ లో నిరుద్యోగభృతి కోసం కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ లక్షల్లో పెరుగుతోంది. మార్చి 21తో ముగిసిన వారాంతానికి 33 లక్షల మంది, ఆపై వారంలో 69 లక్షల మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎకానమీ అయిన యూఎస్ ను కరోనా వైరస్ తీవ్రంగా దెబ్బతీసింది. ఏప్రిల్ లో నిరుద్యోగ రేటు భారీగా పెరగడంతో, రికవరీకి నెలల సమయం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related posts