ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు త్వరలోనే కొత్త గవర్నర్లను నియమించే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేకంగా గవర్నర్ల నియామకంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. అయితే, ఓ తెలుగు రాష్ట్రానికి గవర్నర్ గా నరసింహనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అమిత్ షాతో భేటీ అనంతరం నరసింహన్ మాట్లాడుతూ త్వరలోనే తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు తొలగిపోతాయని చెప్పారు. భవనాల కేటాయింపు వంటి సమస్యలు ఓ కొలిక్కివస్తాయని అన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటినుంచి తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ, ఏపీ కార్యక్రమాలకు హాజరయ్యే క్రమంలో ఆయన హైదరాబాద్, అమరావతి మధ్య రాకపోకలు కొనసాగిస్తున్నారు.


ఓటమి విషయమై ఎవరినీ తప్పుబట్టడం లేదు: దేవెగౌడ