గోపీచంద్ హీరోగా గ్లామరస్ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా దర్శకుడు మారుతీ కాంబోలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “పక్కా కమర్షియల్”. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు.

ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆదివారం నాడు సినిమా ట్రైలర్ విడుదల చేసారు చిత్రయూనిట్ .అయితే ఈ ట్రైలర్ మాత్రం ఊహించని విధంగా ఉందని చెప్పాలి. మారుతీ మార్క్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అన్నట్టు ఈ ట్రైలర్ మంచి ఎలిమెంట్స్ తో కనిపిస్తుంది. హీరో గోపీచంద్ క్యారెక్టరైజేషన్ పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది.

‘మీతో సెల్యూట్ కొట్టించుకోడానికి నేను హీరో కాదురా.. విలన్’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. అలాగే తనతో పాటుగా రాశీ ఖన్నా రోల్ కూడా మంచి ఆసక్తిగా ఉన్నాయి.

ఇంకా సత్య రాజ్ మరియు గోపీచంద్ ల మధ్య ఎమోషనల్ డ్రామా కూడా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుండగా రావు రమేష్ రోల్ అయితే సర్ప్రైజింగ్ గా ఉందని చెప్పాలి. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

జూలై 1న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మొత్తానికి అయితే థియేటర్స్ లో పక్కాగా సాలిడ్ ఫీస్ట్ ఈ ట్రైలర్ తో ప్రామిసింగ్ గా కనిపిస్తుంది.


కరీనా కపూర్, ఆలియా భట్ ఇన్‌స్టా కామెంట్స్ సెక్షన్ బ్లాక్