telugu navyamedia
తెలంగాణ వార్తలు

జూబ్లీహీల్స్ మైనర్ రేప్ కేసు : సాదుద్దీన్ క‌స్ట‌డీ రీపోర్ట్‌లో సంచ‌ల‌న విష‌యాలు. .

*సాదుద్దీన్ క‌స్ట‌డీ రీపోర్ట్‌లో సంచ‌ల‌న విష‌యాలు ..
*బాలీక రేప్ కేసులో సూత్ర‌దారి ఎమ్మెల్యే కొడుకే..
*బెంజికారులో ఎమ్మెల్యే కొడుకే అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు..
*కాసేపట్లో సాదుద్దీన్ ను నాంపల్లి కోర్టు సాదుద్దీన్‌
*చంచ‌ల్‌గూడ జైలుకు త‌ర‌లించ‌నున్నారు.

జూబ్లీహీల్స్ బాలీక రేప్ కేసులో సంచ‌ల విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. బాలికపై సామూహిక అత్యాచారం ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. నిందితులు పబ్‌లోకి ఎంటర్‌ అయ్యే ముందే ఇన్నోవా, బెంజ్‌ కారులో పోలీసులు కండోమ్‌ ప్యాకెట్లను తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కండోమ్‌ ప్యాకెట్లు తెచ్చినట్లు నిందితులు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. రేప్‌ ఇంటెన్షన్‌తోనే పబ్‌కు వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు.

కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ కస్టడీ ముగిసింది. నాలుగు రోజులు క‌స్ట‌డీ ఉన్న ఏ-1 నిందితుడు సాదుద్దీన్ నిబ్బుక‌పోయే విష‌యాలు బ‌య‌ట‌పెట్టాడు. కార్పొరేటర్‌ కుమారుడు అసలు సూత్రధారి అని సాదుద్దీన్‌ పోలీసులకు వివరించాడు. కార్పొరేటర్‌ కుమారుడు, ఎమ్మెల్యే కొడుకు పబ్‌లోకి ఎంటర్‌ కాగానే అమ్మాయిలను వెతకడం ప్రారంభించారని, పబ్‌లోనూ మైనర్‌ అమ్మాయిలను వేధించినట్లు పేర్కొన్నాడు. 

పబ్‌ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్‌ కొడుకు మైనర్‌ వెంట పడ్డారు. వ‌ద్ద‌ని వారించినా మమ్మ‌ల్ని బెదిరించాడ‌ని తెలిపారు. దీంతో నన్ను బెంజ్ కారులో ఎక్కొద్దని ఎమ్మెల్యే కొడుకు ఆదేశించాడు. నన్ను పబ్‌ దగ్గర వదిలి అమ్మాయిని బెంజ్‌ కారులో ఎక్కించుకున్నాడు. నేను బెంజ్‌ కారులో కాకుండా ఇన్నోవాలో బేకరికి వెళ్లాను. బెంజ్ కారులోకి ఎక్కగానే మైనర్ అమ్మాయిని ఏమ్మెల్యే కుమారుడు వేధించడం ప్రారంభించాడు.

ర‌న్నింగ్ కారులో ఇద్ద‌రు అత్యాచారం..ఆ త‌రువాత నిర్మానుష ప్రాంతంలో మ‌రో ముగ్గురు అత్యాచారం చేసిన‌ట్లు వెల్ల‌డించారు. నా ఫ్రెండ్స్‌ బలవంతం కారణంగానే నేనూ ఈ అత్యాచారం చేయాల్సి వచ్చింద‌ని సాదుద్దీన్‌ పోలీసుల ముందు తెలిపాడు.

 మ‌రోవైపు సాదుద్దీన్ మాలిక్ రెచ్చగొట్టడం వల్లే తాము బాలికపై అత్యాచారం చేశామంటూ మైనర్లు పోలీసులకు చెబుతున్నారు.

కాగా సోమవారం మరోసారి అయిదుగురు మైనర్‌లను పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. జువైనల్ హోమ్ నుంచి జూబ్లీహిల్స్ పీఎస్‌కు తరలించనున్నారు.

Related posts