telugu navyamedia
తెలంగాణ వార్తలు

నిరుద్యోగులకు కేసీఆర్ శుభవార్త..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ 2022 సమావేశాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చేశారు. ఊహించినట్లుగానే నిరుద్యోగులకు సీఎం కేసీఆర్‌ తీపికబురు అందించారు.

తెలంగాణవ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం 91,142 ఖాళీలు ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. అందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా.. మిగిలిన 80,039 పోస్టులకు ఇవాళ్టి నుంచే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని సంచలన ప్రకటన చేశారు. మిగిలిన11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు.అసెంబ్లీ వేదికగా కేసీఆర్ బుధవారం నాడు ఈ ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా 95 శాతం స్థానికత కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామని సీఎం పేర్కొన్నారు. విద్యాశాఖలో 25 నుంచి 30 వేల వరకు పోస్టులు, కొత్త జిల్లాలు, జోన్ల ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తామని కేసీఆర్ తెలిపారు. అటెండర్‌ నుంచి ఆర్డీవో వరకు 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వస్తాయన్నారు. ఐదు శాతం మాత్రమే స్థానికేతరులకు వస్తాయని వివరించారు. నియామకాల్లో 95 శాతం స్థానిక కోటా సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని సీఎం తెలిపారు.

పోలీస్ శాఖలో 18,334, విద్యాశాఖలో 13,086, వైద్య, ఆరోగ్యశాఖలో 12,755, ఉన్నత విద్యా శాఖలో 7,878, రెవిన్యూ శాఖలో 3,560, బీసీ సంక్షేమ శాఖలో 4,311, గిరిజన సంక్షేమ శాఖలో 2,399, సాగునీటి శాఖలో 2,692 పోస్టులను భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇవాళ్టి నుండే ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.

మైనారిటీ శాఖలో 1,825,అటవీశాఖలో 1598,పంచాయితీరాజ్ శాఖలో 1455,కార్మిక శాఖలో 1221,ఫైనాన్స్ శాఖలో 1146, మున్సిఫల్ శాఖలో 859, వ్యవసాయ శాఖలో 801, రవాణ శాఖలో 563 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం చెప్పారు.న్యాయ శాఖలో 386,సాధారణ పరిపాలన శాఖలో 343,పరిశ్రమల శాఖలో 233, పర్యాటక శాఖలో 184, సచివాలయం, హెచ్ఓడీ, వర్శిటీల్లో 8,147 ఖాళీలున్నాయని సీఎం వివరించారు.

ఇక గ్రూప్- 1లో 503,గ్రూపు 2లో 582, గ్రూప్ 3లో1373, గ్రూప్ 4 లో9168, జిల్లా స్ధాయి లో 39,829,జోనల్ స్థాయిలో 18866,మల్టీజోన్ లో13170, అదర్ కేటగిరిలో వర్సిటీలలో 8174 భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.

జిల్లాల వారీగా ఖాళీలవివరాలు..

హైదరాబాద్- 5,268, నిజామాబాద్- 1,976, మేడ్చల్ మల్కాజ్‌గిరి- 1,769, రంగారెడ్డి- 1,561, కరీంనగర్- 1,465, నల్లగొండ- 1,398, కామారెడ్డి- 1,340, ఖమ్మం- 1,340, భద్రాద్రి కొత్తగూడెం- 1,316, నాగర్‌కర్నూల్- 1,257, సంగారెడ్డి- 1,243, మహబూబ్‌నగర్- 1,213, ఆదిలాబాద్- 1,193, సిద్దిపేట- 1,178, మహబూబాబాద్- 1,172, హనుమకొండ- 1,157, మెదక్- 1,149, జగిత్యాల- 1,063, మంచిర్యాల- 1,025, యాదాద్రి భువనగిరి- 1,010, జయశంకర్ భూపాలపల్లి- 918, నిర్మల్- 876, వరంగల్- 842, కొమురంభీం ఆసిఫాబాద్- 825, పెద్దపల్లి- 800, జనగాం- 760, నారాయణపేట- 741, వికారాబాద్- 738, సూర్యాపేట- 719, ములుగు- 696, జోగులాంబ గద్వాల- 662, రాజన్న సిరిసిల్ల- 601, వనపర్తి- 556

జోన్‌ల వారీగా ఖాళీల వివరాలు:

కాళేశ్వరం జోన్: 1,630, బాసర: 2,328, రాజన్న సిరిసిల్ల: 2,403, భద్రాద్రి: 2,858, యాదాద్రి: 2,160, చార్మినార్: 5,297, జోగులాంబ: 2,190, మల్టీ జోన్-1: 6800, మల్టీ జోన్-2: 6870

Related posts