telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణ ఆసుపత్రులకు 5 కోట్ల డోలో టాబ్లెట్లు!

Dolo tablets hospitals

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. పీహెచ్సీలు, సీహెచ్సీలతో అన్నీ ఆసుపత్రులకు భారీ ఎత్తున ఔషధాలను సరఫరా చేసింది. సాధారణ సీజనల్ వ్యాధులు కూడా పెరగడంతో అధికారులు, 5 కోట్ల పారాటిటమాల్ టాబ్లెట్లు (డోలో)లను అన్ని ఆసుపత్రులకు చేర్చింది.

దీంతో పాటు మరో 54 రకాల ఔషధాలను కూడా అధికారులు అందుబాటులోకి తెచ్చారు. వీటిల్లో యాంటీ బయాటిక్స్ అయిన అజిత్రో మైసిన్ తో పాటు, సీ, డీ విటమిన్ టాబ్లెట్లు, మల్టీ విటమిన్ టాబ్లెట్లు, జలుబు, దగ్గు, బీపీ, మధుమేహం, ఇతర శ్వాసకోశ సంబంధ ఔషధాలను, ఎమర్జెన్సీ మెడిసిన్స్ ను సరఫరా చేసింది.

కరోనా తీవ్రంగా ఉన్న వారికి అవసరమయ్యే రెమిడిసివిర్, ఫాబి ఫ్లూ వంటి మందులకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్నందున, కొంత కొరత ఉందని, అందువల్ల అవసరమైనంత మేరకు జిల్లాలకు ఇంకా సరఫరా చేయలేకపోయామని ఉన్నతాధికారులు వెల్లడించారు. అతి త్వరలోనే మరిన్ని ఆర్డర్లు తెప్పించేందుకు ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు.

Related posts