telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్ అంటే చాలా క్రష్ అంటున్న సీనియర్ హీరోయిన్

Kasthuri

సీనియర్ నటి కస్తూరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. “ఇప్పటివరకూ నేను చాలా మంది హీరోలతో కలిసి నటించాను.. కానీ క్రష్‌ మాత్రం హీరో నాగార్జున మీదనే. మోడలింగ్‌ చేస్తున్న సమయంలో ఆయనని ఒకసారి కలిశాను. అప్పుడు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాను. అలా ఆ చేతిని కడగకుండా 24 గంటలు ఉంచాను. ఇక క్రికెట్ లో నాకు ధోని అంటే ఇష్టం. అయితే ధోనిని చూసినప్పుడల్లా సుశాంత్‌ గుర్తొస్తున్నాడు” అంటూ చెప్పుకొచ్చింది. కాగా ఏ హీరోకైనా తల్లిగా నటిస్తారా? అన్న ప్రశ్నకి కస్తూరి స్పందిస్తూ.. “చేస్తాను కానీ ఆ హీరో తండ్రిగా, కొడుకుగా డబుల్‌ యాక్షన్‌ చేయాలి” అంటూ చాలా తెలివిగా జవాబు ఇచ్చింది.. ఇక హీరోలలో విజయ దేవరకొండకు తల్లిగా అస్సలు చేయనని, విజయ్ అంటే చాలా క్రష్ అని, బొమ్మరిల్లు సినిమాలో హీరోయిన్ జెనీలియా పోషించిన పాత్ర తన నిజజీవితానికి దగ్గరగా ఉంటుందంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు కస్తూరి. కాగా కస్తూరి, అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘అన్నమయ్య’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత చిలక్కొట్టుడు, ఆకాశ వీధిలో మొదలగు సినిమాలలో హీరోయిన్ గా నటించింది కానీ అవి ఆమెకి పెద్దగా పేరు తీసుకురాలేదు. ప్రస్తుతం కస్తూరి ‘గృహలక్ష్మి’ అనే సీరియల్లో కీలక పాత్ర పోషిస్తుంది.

Related posts