telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి…

Gold rates hike

బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపించిన ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. కానీ ఈరోజు ఢిల్లీలో హైదరాబాద్ లో బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయి. కరోనా అనంతరం 50 వేల ను దాటినా బంగారం ఇప్పుడు మొదటిసారి కిందకి దిగ్గి వచ్చింది. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా రూ. 52,750 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా రూ. 46,200 వద్ద ముగిసింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 50,400 కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ. 46,200 పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే 300 పెరిగి రూ. 70,700 కు చేరుకుంది.

Related posts