నటిగా, రాజకీయ నాయకురాలిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు జయలలిత. టాప్ హీరోయిన్ జయలలిత తెలుగు, తమిళం, కన్నడ భాషలలో దాదాపు 140కి పైగా సినిమాలు చేసింది. 1960 మధ్య కాలంలో టాప్ హీరోయిన్గా ప్రేక్షకులను అలరించింది అందాల నటి జయలలిత.భారత రాజకీయాలలోను ముఖ్య పాత్ర పోషించిన జయలలిత దాదాపు 14 సంవత్సరాలకి పైగా తమిళనాడు ముఖ్యమంత్రి బాధ్యతలని నిర్వర్తించింది. తమిళ తంబీలు అమ్మగా పిలుచుకొనే జయలలిత కొద్ది రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె బయోపిక్ ను రూపొందించేందుకు పలువురు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేతి రెడ్డి జగదీశ్వర్ రెడ్డి “శశి లలిత” పేరిట బయోపిక్ చేస్తున్నాడు. అలానే తమిళ దర్శకురాలు ప్రియదర్శిని “ది ఐరన్ లేడీ” పేరుతో జయలలిత బయోపిక్ రూపొందిస్తుంది. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ “తలైవీ” అనే టైటిల్‌తో జయలలిత బయోపిక్‌ని తెరకెక్కిస్తుండగా, ఇందులో కంగనా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ జయలలిత జీవితంపై కల్పిత వెబ్ సిరీస్ చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికి “క్వీన్” అని పేరు పెట్టారు. MX ప్లేయర్లో ప్రసారం కానున్న ఈ సిరీస్‌లో రమ్య కృష్ణన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే పవర్ ఫుల్ పాత్రలలో అలరించిన రమ్యకృష్ణన్ జయలలితగా కూడా ప్రేక్షకులని మెప్పిస్తుందని అంటున్నాడు దర్శకుడు. వెబ్ సిరీస్ ప్రీమియర్ తేదీని త్వరలో ప్రకటించాలని భావిస్తున్నారు మేకర్స్. ఇక జయలలిత బయోపిక్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మీరు చూసే చూపులోనే తప్పుంది..దుప్పటి కప్పుకొని కూర్చొన్న అశ్లీలంగానే కనిపిస్తాం