సుశాంత్ మరణంతో బాలీవుడ్‌లో నెపోటిజంపై గరంగరం చర్చ నడిచింది. నెటిజన్లు పలువురు సెలెబ్రిటీలపై తీవ్ర విమర్శలతో మండిపడ్డారు. ముఖ్యంగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నెపోటిజంపై కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా కంగనా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. కంగనా ఒక హిందీ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ సుశాంత్ కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసులు తాను మనాలీ ఉండగా ఫోన్ చేశారనీ, అయితే తన స్టేట్‌మెంట్‌ను తీసుకోవడానికి ఎవరినైనా పంపించాలని కోరినా ఎవరూ రాలేదని, అయితే ఈ విషయంలో తాను ఏం మాట్లాడినా బహిరంగంగానే మాట్లాడానని, తాను పారిపోయే మనషిని కాదని స్పష్టం చేసింది. నెపోటిజం విషయంలో తన వాదనలను నిరూపించుకోలేకపోతే తన పద్మశ్రీని పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తానని, అది ఉంచుకునే అర్హత తనకు లేదని కంగనా చెప్పడం సంచలనంగా మారింది.